PM Modi: గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

70 ఏళ్ల తర్వాత భారత ప్రజలు ప్రత్యేక తీర్పునిచ్చారని, అధికారంలోకి వచ్చాక 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తున్నామని, వచ్చే వందేళ్లను దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు.

Update: 2024-09-16 08:19 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: 70 ఏళ్ల తర్వాత భారత ప్రజలు ప్రత్యేక తీర్పునిచ్చారని, అధికారంలోకి వచ్చాక 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తున్నామని, వచ్చే వందేళ్లను దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. ఇవాళ గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరగనున్న గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ    మీట్, ఎక్స్ పో సదస్సును ఆయన ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరగనున్న సదస్సులో రెన్యూవబుల్ ఎనర్జీపై సుదీర్గ చర్చలు జరగునున్నాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ నుంచి సీఎం చంద్రబాబు సహా ఇతర రాష్ట్రాల సీఎం దేశీయ, విదేశీ పెట్టుబడిదారులతో పాటు దేశ విదేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ సెంటర్ లో తెలంగాణ తరపున రెన్యువబుల్ ఎనర్జీ స్టాల్ ఏర్పాటు చేశారు.

మోడీ మాట్లాడుతూ.. ఈ సదస్సుకు హజరైన పెట్టుబడిదారులు, ప్రతినిధిలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. మూడో అతిపెద్ద అర్థిక వ్యవస్థగా మారాలని సంకల్పించామని, గడిచిన వంద రోజుల్లో గ్రీన్ ఎనర్జీ దిశగా అడుగులు వేశామని తెలిపారు. ప్రపంచలం ఎదుర్కొనే అనేక సమస్యలకు భారత్ పరిష్కారం చూపిస్తోందని, పాలు తేనే ఉత్పత్తిలో విప్లవాత్మక అడుగులు వేస్తున్నామని అన్నారు. ప్రకృతితో అనుసంధానమై జీవించాలని గాంధీజి చెప్పారని, ఆయన స్పూర్తితో వచ్చే వందేళ్లను దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 2047 లోగా అభివృద్ది చెందిన దేశంగా మారాలనేది మా లక్ష్యమని, సౌర, పవన, అణు విద్యుత్ రంగాల్లో మరింత పురోగతి సాధిస్తామని తెలిపారు. ఇక పీఎం సూర్య ఘర్.. సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన పథకమని, ఈ పథకం గురించి ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలని, దీని ద్వారా దేశంలోని ప్రతి ఇల్లూ విద్యుదుత్పత్తి చేయాలని సంకల్పించారు.

సూర్య ఘర్ ద్వారా ప్రతీ ఇంట్లో ఏడాదికి 25 వేలు ఆదా చేసుకోవచ్చని, సౌర విద్యుత్ ద్వారా వాతవరణ కాలుష్యాన్ని మరింత తగ్గించవచ్చని, వ్యవసాయరంగంలోనూ సౌర విద్యుత్ వినియోగం పెరుగుతోందని తెలిపారు. అంతేగాక గ్రీన్ హైడ్రోజన్ రంగంలో నెంబర్ వన్ గా మారుతున్నామని, భవిష్యత్తులో రైల్వేల్లో బయో టాయిలెట్లు మరిన్ని పెంచుతామని అన్నారు. ఇక అనేక రంగాల్లో మెడిన్ ఇండియా సత్తా చాటుతామని, పునరుత్పదాక ఇంధన ఉత్పత్తిలో భారత్ ది ప్రత్యేక స్థానమని చెప్పారు. అలాగే భావితరాల కోసం పర్యావరణాన్ని కాపాడాలని, మనం వేసే ప్రతీ అడుగు భవిష్యత్ తరాల కోసమేనని ఉద్గాటించారు. ఎంతో నమ్మకంతో ప్రజలు మాకు మూడో సారి అధికారం అప్పగించారని, చాలా ఏళ్ల తర్వాత భారత ప్రజలు ప్రత్యేకమైన తీర్పు ఇచ్చారని అన్నారు. ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన వర్గాల శ్రేయస్సు కోసం పనిచేస్తామని, మూడో సారి అధికారంలోకి వచ్చాక 3 కోట్ల ఇళ్లు నిర్మించతలపెట్టామని చెప్పారు. అయధ్యను మోడల్ సిటీగా అభివృద్ది చేయడమే తమ లక్ష్యమని మోడీ వ్యాఖ్యానించారు. 


Similar News