PM Modi: మోడీ భద్రతావలయంలో మహిళ.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

ప్రధానమంత్రి నరేంద్రమోడీ భద్రతా వలయంలో మహిళా కమాండోలు ఉన్నారనే వార్తపై చర్చ జరుగుతోంది. దీనిపై భద్రతా వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.

Update: 2024-11-29 04:01 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్రమోడీ భద్రతా వలయంలో మహిళా కమాండోలు ఉన్నారనే వార్తపై చర్చ జరుగుతోంది. దీనిపై భద్రతా వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. వైరల్ గా మారిన పిక్ లోని మహిళ మాత్రం ఎస్‌పీజీ బృందంలో భాగం కాదని స్పష్టంచేశాయి. ఆమె రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు(Murmu) కేటాయించిన పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ అని వెల్లడించాయి. సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసు ఫోర్స్‌ (CRPF)లో అసిస్టెంట్‌ కమాండెంట్‌గా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే, ఆమె పేరు, ఇతర వివరాలను మాత్రం అధికారిక వర్గాలు పంచుకోలేదు. ఇక, కొందరు మహిళా ఎస్‌పీజీ కమాండోలు ప్రధాని ప్రధాని మోడీ(PM Modi) భద్రతా బృందంలో ఉన్నట్లు వెల్లడించాయి. ‘క్లోజ్‌ ప్రొటెక్షన్ టీమ్‌’లో సభ్యులుగా ఉన్నట్లు తెలిపాయి.

కంగనా షేర్ చేసిన ఫొటో వైరల్

ఇకపోతే, పార్లమెంట్ వద్ద ప్రధాని (PM Modi) నడుస్తుండగా ఆయన వెనక ఓ మహిళా భద్రతా సిబ్బంది (Woman Commando) కన్పించారు. ఈ ఫొటోను బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్(Kangana Ranaut) తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పంచుకున్నారు. దీంతో ఈ ఫొటో వైరల్ గా మారింది. దీనికి కంగనా ఎలాంటి క్యాప్షన్‌ రాయనప్పటికీ.. ఆమె ప్రధాని భద్రతా బృందం అయిన స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (SPG)లో సభ్యురాలే అయి ఉండొచ్చని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. దీంతో ప్రధాని భద్రతలో మహిళా కమాండో ఉన్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపైనే భద్రతా వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.

Tags:    

Similar News