Husband Suicide: భార్య వేధింపులు తాళలేక.. యువకుడు ఆత్మహత్య..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెళుగుప్ప మండలం దుద్దేకుంట గ్రామానికి చెందిన ఆవుల అనిల్ కియా మోటార్స్ లో ఉద్యోగం చేస్తున్నాడు. విడపనకల్లు మండలం హావగిళి గ్రామానికి చెందిన గీత అనే యువతితో ఏడాది క్రితం పెద్దలు వివాహం చేశారు.

Update: 2024-11-29 05:04 GMT

దిశ, వెబ్ డెస్క్: నా భార్య వేధింపులు భరించలేక చనిపోతున్నా.. అని ఓ యువకుడు తీసుకున్న సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. అమ్మా నాన్న నన్ను క్షమించండి.. నా భార్య వేధింపులను భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నా. అత్తామామలు మంచివాళ్లే. కానీ.. తను వాళ్లున్నపుడు ఒకలా, లేనపుడు మరోలా ప్రవర్తిస్తూ.. చనిపోతానని బెదిరిస్తోంది. ఆ బాధను భరించలేకనే నేను చనిపోతున్నా. అన్నయ్య.. అమ్మా, నాన్నను జాగ్రత్తగా చూసుకో.. అంటూనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెళుగుప్ప మండలం దుద్దేకుంట గ్రామానికి చెందిన ఆవుల అనిల్ కియా మోటార్స్ లో ఉద్యోగం చేస్తున్నాడు. విడపనకల్లు మండలం హావగిళి గ్రామానికి చెందిన గీత అనే యువతితో ఏడాది క్రితం పెద్దలు వివాహం చేశారు. పెళ్లైనప్పటి నుంచి గీత ప్రవర్తన సరిగ్గా ఉండేది కాదని, ప్రతి విషయానికి గొడవ పడటంతో పెద్దలు పలుమార్లు సర్ది చెప్పారు.

తాజాగా మరోసారి గొడవ పడటంతో.. అనిల్ 27న గంగవరం వెళ్తున్నానని చెప్పి తిరిగి రాలేదు. ఆ రోజు సాయంత్రం వాట్సప్ స్టేటస్ లో.. తన భార్య ప్రవర్తన సరిగా లేదని, అందుకే పురుగుల మందు తాగి చనిపోతున్నానని సెల్ఫీ వీడియో పెట్టాడు. ఇతర సోషల్ మీడియాల్లోనూ వీడియో పోస్ట్ చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకూ అతని ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు గాలిస్తున్నారు. అన్న రాము ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News