Congress : నెహ్రూ పేరును మోడీ అందుకే వాడుకుంటున్నారు : కాంగ్రెస్

దిశ, నేషనల్ బ్యూరో : జవహర్‌లాల్ నెహ్రూ(Nehru)పై లోక్‌సభలో ప్రధాని మోడీ(PM Modi) చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ(Congress) జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఖండించారు.

Update: 2024-12-15 10:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో : జవహర్‌లాల్ నెహ్రూ(Nehru)పై లోక్‌సభలో ప్రధాని మోడీ(PM Modi) చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ(Congress) జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఖండించారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యాల పైనుంచి దేశ ప్రజల దృష్టిని మరల్చేందుకే నెహ్రూ పేరును ప్రధాని మోడీ వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.

ప్రభుత్వ వైఫల్యాలపై దేశ ప్రజలకు సమాధానం చెప్పే సాహసం ప్రధానికి లేదని జైరాం రమేశ్ విమర్శించారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ లేని నవ్య భవ్య భారతదేశాన్ని అస్సలు ఊహించుకోలేమన్నారు. 2014కు ముందు భారతదేశం సాధించిన ఎన్నో అపూర్వ విజయాలకు నెహ్రూయే పునాది వేశారని ఆయన గుర్తు చేశారు.

Tags:    

Similar News