Supreme Court Collegium : సుప్రీంకోర్టు కొలీజియం ఎదుటకు హైకోర్టు జడ్జి.. ‘ఇది హిందుస్తాన్’ వ్యాఖ్యలపై వివరణ

దిశ, నేషనల్ బ్యూరో : ‘‘ఇది హిందుస్తాన్.. ఇక్కడ మెజారిటీ ప్రజల అభిమతమే నడుస్తుంది’’ అంటూ అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్(Justice Shekhar Yadav) ఇటీవలే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-12-15 11:33 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ‘‘ఇది హిందుస్తాన్.. ఇక్కడ మెజారిటీ ప్రజల అభిమతమే నడుస్తుంది’’ అంటూ అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్(Justice Shekhar Yadav) ఇటీవలే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు ఆయన త్వరలోనే భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సారథ్యంలోని సుప్రీంకోర్టు కొలీజియం(Supreme Court Collegium) ఎదుట హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను డిసెంబరు 10వ తేదీనే అలహాబాద్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్నట్లు సమాచారం.

డిసెంబరు 8న అలహాబాద్‌లో విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నిర్వహించిన కార్యక్రమంలో హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలతో దినపత్రికల్లో ప్రచురితమైన న్యూస్ రిపోర్ట్స్, టీవీ/యూట్యూబ్ మీడియాలలో పబ్లిష్ అయిన వీడియో క్లిప్‌లను సుప్రీంకోర్టు కొలీజియంకు పంపినట్లు స్వయంగా అధికార వర్గాలు వెల్లడించాయి. సుప్రీంకోర్టు అధికార వర్గాలు కూడా దీన్ని ధ్రువీకరించాయి. జడ్జి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఇటీవలే బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడా ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

Tags:    

Similar News