Mani Shankar Aiyar : ప్రణబ్‌ను ప్రధానిగా చేస్తే యూపీఏ మరోసారి గెలిచేది : అయ్యర్

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ సీనియర్ నేత 83 ఏళ్ల మణిశంకర్ అయ్యర్(Mani Shankar Aiyar) రచించిన పుస్తకం ‘ఎ మవెరిక్ ఇన్ పాలిటిక్స్’ త్వరలోనే విడుదల కానుంది.

Update: 2024-12-15 08:29 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ సీనియర్ నేత 83 ఏళ్ల మణిశంకర్ అయ్యర్(Mani Shankar Aiyar) రచించిన పుస్తకం ‘ఎ మవెరిక్ ఇన్ పాలిటిక్స్’ త్వరలోనే విడుదల కానుంది. పలు ఆసక్తికర రాజకీయ అంశాలను ఈపుస్తకంలో ఆయన ప్రస్తావించారు. యూపీఏ కూటమి రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు.. మన్మోహన్‌సింగ్‌(Manmohan)ను రాష్ట్రపతిగా చేసి, ప్రణబ్ ముఖర్జీ(Pranab)కి ప్రధానమంత్రి పదవిని ఇచ్చి ఉండాల్సిందని మణిశంకర్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. 2012 సంవత్సరం నాటికి రాష్ట్రపతి పదవి ఖాళీగా ఉందని.. దాన్ని మన్మోహన్‌సింగ్‌ను కేటాయించి ఉంటే బాగుండేదన్నారు. ఒకవేళ మన్మోహన్‌ను రాష్ట్రపతి స్థానానికి ప్రమోట్ చేసి.. ప్రణబ్‌కు ప్రధాని పదవిని కట్టబెట్టి ఉంటే యూపీఏ-2 హయాంలో పాలనాపరమైన స్తబ్ధత నెలకొనేదే కాదని మణిశంకర్ పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీకి ప్రధానిగా పట్టం కట్టి ఉంటే.. ఆయన అందించే నూతన గవర్నెర్స్ ప్రభావంతో యూపీఏ కూటమి మూడోసారి కూడా అధికారంలోకి వచ్చి ఉండేదన్నారు.

‘‘2012 సంవత్సరంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు పలుమార్లు కరోనరీ బైపాస్ సర్జరీలు జరిగాయి. ఆయన శారీరకంగా కోలుకోవడానికి చాలా టైం పట్టింది. దీని ప్రతికూల ప్రభావం యూపీఏ-2 పాలనా విధానంపై పడింది’’ అని మణిశంకర్ అయ్యర్ తన పుస్తకంలో ప్రస్తావించారు. ‘‘నాటి ప్రధాని మన్మోహన్ ఆరోగ్యం గురించి కానీ.. నాటి కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష స్థానంలో ఉన్న వారి ఆరోగ్యం గురించి కానీ అధికారిక ప్రకటనలేవీ విడుదల చేయలేదు. ఫలితంగా రెండుచోట్లా పాలనా వ్యవహారాలు డీలా పడ్డాయి. వీటి పర్యవసానం తదుపరి ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. యూపీఏ కూటమి ఓడిపోయింది’’ అని ఆయన పేర్కొన్నారు. అన్నా హజారే చేసిన ‘ఇండియా అగైనెస్ట్ కరప్షన్’ ఉద్యమం సహా చాలా సవాళ్లను యూపీఏ సర్కారు సమర్ధంగా ఎదుర్కోలేకపోయిందని మణిశంకర్ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News