PM Modi, Kharge : ఖర్గే, మోడీ నవ్వులు! పార్లమెంట్ ఆవరణలో ఆసక్తికర సన్నివేశం వైరల్
అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో మహాపరినిర్వాణ్ దివాస్ కార్యక్రమం నిర్వహించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో (Mahaparinirvan Diwas) మహాపరినిర్వాణ్ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా (PM Modi) ప్రధాని మోడీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (Dr BR Ambedkar) చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని మోడీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) పరస్పరం పలకరించుకొని నవ్వుతూ మాట్లాడుకున్నారు. మొదట ఖర్గే ప్రధాని మోడీ వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అనంతరం ఇరువురు ముచ్చటించారు. ఖర్గే చెప్పిన ముచ్చట విని ప్రధాని మోడీతో పాటు అందరూ సరదాగా నవ్వారు.
ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకునే నాయకులు ఇలా సంతోషంగా ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంబేడ్కర్‌కు నివాళులు అర్పించిన వారిలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, విపక్ష నేతలు ఉన్నారు.