సవాళ్లను అవకాశాలుగా మారుస్తాం : ప్రధాని మోడీ

దేశం ముందున్న అన్ని సవాళ్లను నవభారతం కోసం అవకాశాలుగా మారుస్తూనే ఉంటామని ప్రధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు.

Update: 2023-06-11 14:13 GMT

న్యూఢిల్లీ : దేశం ముందున్న అన్ని సవాళ్లను నవభారతం కోసం అవకాశాలుగా మారుస్తూనే ఉంటామని ప్రధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. ఆదివారం న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఉన్న ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌లో మొట్టమొద‌టి జాతీయ శిక్షణా సదస్సును ప్రారంభించిన అనంత‌రం ఆయ‌న మాట్లాడారు. "ఈ వైవిధ్యమైన సమావేశం ఆలోచనల మార్పిడిని ప్రోత్సహిస్తుంది.. ఎదుర్కొంటున్న సవాళ్లకు అందుబాటులో ఉన్న అవకాశాలను గుర్తిస్తుంది. మ‌న సామర్థ్యాన్ని పెంపొందించడానికి కార్యాచరణ పరిష్కారాలు సమగ్ర వ్యూహాలను సృష్టిస్తుంది" అని మోడీ పేర్కొన్నారు.

సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్‌ల మధ్య సహకారాన్ని పెంపొందించడం, దేశవ్యాప్తంగా సివిల్ సర్వెంట్లకు శిక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే లక్ష్యంతో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. సెంట్రల్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్స్, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్స్, రీజినల్ అండ్ జోనల్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్స్, రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్స్ సహా వివిధ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లకు చెందిన 1,500 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలకు చెందిన సివిల్ సర్వెంట్లతో పాటు ప్రయివేటు రంగానికి చెందిన నిపుణులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.


Similar News