Pakistan : పాక్‌లో మైనారిటీ మహిళల పరిస్థితిపై భారత్ కీలక వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్‌‌పై భారత్ (India) నిప్పులు చెరిగింది.

Update: 2024-10-26 16:59 GMT

దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్‌‌పై భారత్ (India) నిప్పులు చెరిగింది. హిందువులు, సిక్కులు, క్రైస్తవుల వంటి మైనారిటీ వర్గాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవించాల్సిన దుస్థితి పాక్‌లో ఉందని ఐక్యరాజ్యసమితిలోని భారత్ శాశ్వత ప్రతినిధి పి.హరీశ్ అన్నారు. మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు పాకిస్తాన్‌(Pakistan)లో దుర్భర పరిస్థితుల్లో జీవించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘మహిళలు - శాంతిభద్రతలు’ అనే అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిర్వహించిన సమావేశంలో పి.హరీశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్‌‌లో మైనారిటీల స్థితిగతులపై, కశ్మీర్ అంశంపై తప్పుడు ప్రచారం చేయడాన్ని పాకిస్తాన్ పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ఐక్యరాజ్యసమితి(UN)లో జరిగే కీలకమైన సమావేశాలను కూడా రాజకీయ దుష్ప్రచారానికి పాక్ వాడుకుంటోందని దుయ్యబట్టారు. ‘‘పాక్‌లో ఏటా ఎంతోమంది మైనారిటీ వర్గాల మహిళలు కిడ్నాప్‌కు గురవుతున్నారు. బలవంతంగా వారిని మతం మార్పిస్తున్నారు. బలవంతంగా వారిని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ వివరాలన్నీ పాకిస్తాన్ మానవ హక్కుల సంఘం నివేదికలో ప్రస్తావించినవే’’ అని పి.హరీశ్ చెప్పారు.

Tags:    

Similar News