బెంగళూరులో ఏరో ఇండియా 2023 ను ప్రారంభించిన ప్రధాని మోడీ

బెంగళూరులో నిర్వహిస్తున్న ఏరో ఇండియా 2023 14వ ఎడిషన్ ను భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రారంభించారు.

Update: 2023-02-13 06:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరులో నిర్వహిస్తున్న ఏరో ఇండియా 2023 14వ ఎడిషన్ ను భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.."రక్షణ మరియు అంతరిక్ష రంగాల్లో మన దేశానికి ఉన్న అపరిమిత సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ఏరో ఇండియా ఒక అద్భుతమైన వేదిక" అని ప్రధాని మోడీ అన్నారు.

అలాగే ఒకప్పుడు ఏరో ఇండియా కేవలం ప్రదర్శనకు మాత్రమే పరిమితమైందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని.. నేడు అది భారత్‌కు బలం అని ప్రధాని మోడీ ఏరో ఇండియా 2023 14వ ఎడిషన్ గురించి అన్నారు.

Tags:    

Similar News