Prashant Kishor : టెన్త్ ఫెయిల్ నాయకత్వం బిహార్‌కు అక్కర్లేదు : పీకే
దిశ, నేషనల్ బ్యూరో : టెన్త్ క్లాస్ ఫెయిలైన వాళ్ల నాయకత్వం బిహార్ రాష్ట్రానికి అక్కర్లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో : టెన్త్ క్లాస్ ఫెయిలైన వాళ్ల నాయకత్వం బిహార్ రాష్ట్రానికి అక్కర్లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. రాజకీయాల్లోకి వచ్చే వాళ్లకు కనీస విద్యార్హతలు ఉండాలని బిహార్ ప్రజలు కోరుకుంటున్నారని, దానిపై నిర్ణయం జరగాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన తెలిపారు. ఔత్సాహిక యువతీ యువకులందరికీ జన్ సురాజ్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తామని పీకే ప్రకటించారు. ‘‘ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలి ? డబ్బులు ఎలా ? అనే దాని గురించి ఎవరూ ఆలోచించొద్దు.
ఇక్కడ ప్రశాంత్ కిశోర్ ఉన్నాడని గుర్తుంచుకోండి’’ అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా తన ఉద్యమ సంస్థ ‘జన్ సురాజ్’ను రాజకీయ పార్టీగా మారుస్తానని పీకే ప్రకటించిన సంగతి తెలిసిందే.