అరుణాచల్ సీఎంగా పెమా ఖండూ ప్రమాణ స్వీకారం..వరుసగా మూడోసారి బాధ్యతలు

ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎంగా మరోసారి ఫెమా ఖండూ నిమాయకం కాగా..

Update: 2024-06-13 06:31 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎంగా మరోసారి ఫెమా ఖండూ నిమాయకం కాగా..గురువారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈటానగర్‌లోని దోర్జి ఖండూ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ కేటీ పర్నాయక్ ఖండూతో ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎంగా చౌనా మెయిన్ , మరో 10 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు.

కాగా, పెమా ఖండూ సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది వరుసగా మూడోసారి. మొదట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఖండూ రాష్ట్రంలో జరిగిన పలు రాజకీయ పరిణామాల వల్ల 2016లో తొలిసారిగా అరుణాచల్ ప్రదేశ్ సీఎం అయ్యాడు. కొన్ని నెలల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరితో కలిసి పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్‌(పీపీఏ)లో చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే 2016డిసెంబర్‌లో పీపీఏ నుంచి ఖండూను బహిష్కరించారు. అనంతరం ఆయన పలువురు శాససభ్యులతో కలిసి బీజేపీలో చేరి తన సీటును కాపాడుతకున్నారు. ఈ క్రమంలోనే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ విజయం సాధించింది. దీంతో ఖండూ సీఎంగా ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ గెలుపొందడంతో ఖండూను మరోసారి బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. 


Similar News