Congress: మనుస్మృతిని విశ్వసించే వారు అంబేద్కర్ ని విభేదిస్తారు.. అమిత్ షాపై కాంగ్రెస్ విమర్శలు

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి.

Update: 2024-12-18 06:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. అమిత్ షా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌(Congress) పార్టీ డిమాండ్‌ చేస్తోంది. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీతో(Rahul Gandhi) పాటు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్‌ ఖర్గే(Congress president Mallikarjun Kharge) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుస్మృతిని విశ్వసించే వారు కచ్చితంగా అంబేద్కర్‌తో విభేదిస్తారు అని సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా రాహుల్‌ గాంధీ రాసుకొచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్‌ను హోంమంత్రి షా అవమానించడంతో బీజేపీ- ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ జెండాకు వ్యతిరేకమని నిరూపించిందని పేర్కొన్నారు. సంఘ్ పరివార్ ప్రజలు మనుస్మృతిని అమలు చేసేందుకు చూస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. అంబేద్కర్ ఆ దేవుడి కంటే తక్కువేం కాదు.. ఆయన దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, పేదలకు అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. ఇక, అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలని రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు నోటీసు ఇచ్చింది.

అమిత్ షా ఏమన్నారంటే?

అయితే, భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్ లోని ఉభయ సభల్లో రెండు రోజుల పాటు భారత రాజ్యాంగంపై చర్చ కొనసాగింది. కాగా, మంగళవారం జరిగిన చర్చ సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కాంగ్రెస్‌పై తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే హస్తంపార్టీ బీఆర్‌ అంబేద్కర్‌ పేరును వాడుకుంటుందని ఆరోపించారు. అంబేద్కర్, అంబేద్కర్ అని జపం చేయడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారిందని అన్నారు. అంబేద్కర్ పేరుకు బదులుగా దేవుడి పేరు తలుచుకుంటేనైనా కొంచెం పుణ్యమైన వస్తుంది.. స్వర్గానికి వెళ్లొచ్చని కాంగ్రెస్ పార్టీపై విరుచుకు పడ్డారు.

Tags:    

Similar News