జమిలి ఎన్నికల బిల్లుపై JPC నియమించిన కేంద్రం..!!
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని జమిలి ఎన్నికల(One Nation One Poll) బిల్లును మంగళవారం లోక్‌సభలో ప్రవేశ పెట్టింది
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని జమిలి ఎన్నికల(One Nation One Poll) బిల్లును మంగళవారం లోక్‌సభలో ప్రవేశ పెట్టింది. ఈ జమిలి ఎన్నికల బిల్లులు అనేవి రాజ్యాంగ(Constitution) సవరణ బిల్లులు. వాటికి ఆమోదం లభించాలంటే తప్పకుండా మూడింట రెండోవంతు మెజారిటీ అవసరం. దీంతో తదుపరిగా సమగ్ర చర్చల కోసం ఈ బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపుతామని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రకటించింది. కాగా ఈ బిల్లుపై JPC కేంద్రం నియమించింది. ఇందులో మొత్తం 31 మంది ఎంపీలతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో 21 మంది లోక్‌సభ, 10 మంది రాజ్యసభ సభ్యులకు స్థానం కల్పించింది. జమిలి ఎన్నికల బిల్లుపై సంప్రదింపులు, అధ్యయనం చేయాలని సూచించింది. కాగా ఈ జమిలి ఎన్నికల బిల్లుపై సంప్రదింపులు, ఆధ్యాయనంకు మూడు నెలల కాలపరిమితిని విధించినట్లు తెలుస్తుంది. కాగా ఈ జేపీసీలో ఎవరెవరికి అవకాశం దక్కిందనే దానిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.