వినేష్ ఫొగాట్ భారీ రివార్డ్ ప్రకటించిన పంజాబ్ లవ్లీ యూనివర్సిటీ

పంజాబ్ లవ్లీ యూనివర్సిటీ రెజ్లర్ వినేష్ ఫొగాట్ కు రూ. 25 లక్షల రివార్డ్ ప్రకటించింది.

Update: 2024-08-08 10:11 GMT

దిశ, వెబ్ డెస్క్ : పంజాబ్ లవ్లీ యూనివర్సిటీ రెజ్లర్ వినేష్ ఫొగాట్ కు రూ. 25 లక్షల రివార్డ్ ప్రకటించింది. ఒలంపిక్స్ లో వినేష్ అపార ప్రతిభ చూపిందని, దేశ ప్రజల దృష్టిలో తాను పతకం గెలిచినట్టే అని యూనివర్సిటీ ఛాన్సలర్ అశోక్ తెలిపారు. కాగా వినేష్ పంజాబ్ యూనివర్సిటీలో ఎంఏ సైకాలజీ విద్యార్థి. యూనివర్సిటీ ఛాన్సలర్ అశోక్ మాట్లాడుతూ.. వినేష్ దృఢ సంకల్పం గొప్పదని, తనకి రెజ్లింగ్ లో అపారమైన స్కిల్ ఉందని కొనియాడారు. తను మా యూనివర్సిటీ విద్యార్థి అయినందుకు మేము గర్వ పడుతున్నామని తెలిపారు. తమ యూనివర్సిటీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ గెలిస్తే రూ.50 లక్షలు, సిల్వర్ మెడల్ గెలిస్తే రూ.25 లక్షలు, కాంస్యం గెలిస్తే రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించారు.  


Similar News