జయలలిత మృతిపై రిపోర్టు .. 600 పేజీలు.. 150 మందిని విచారణ
చెన్నయ్: తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ఆర్ముగ స్వామి కమిషన్ నివేదికను సిద్ధం చేసింది. ఈ మేరకు జడ్జి ఆర్ముగ స్వామి తన నివేదికను శనివారం సీఎం స్టాలిన్‌కు అందజేశారు..Latest Telugu News
చెన్నయ్: తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ఆర్ముగ స్వామి కమిషన్ నివేదికను సిద్ధం చేసింది. ఈ మేరకు జడ్జి ఆర్ముగ స్వామి తన నివేదికను శనివారం సీఎం స్టాలిన్‌కు అందజేశారు. 600 పేజీలతో దాదాపు 150 మందిని విచారణ జరిపినట్లు కమిషన్ వెల్లడించింది. కాగా, 2016 సెప్టెంబర్ 22వ తేదీన జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. 2016 డిసెంబర్ 5న ఆమె తుది శ్వాస విడిచారు. అయితే మరణించడానికి ముందు 75 రోజులపాటు చెన్నయ్‌లోని అపోలో ఆస్పత్రిలోనే ఉన్నారు. జయలలిత మృతిపై అనుమానాలు తలెత్తడంతో శశికళ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.
దీంతో జయలలిత మరణం వెనుక గల కారణాలు తెలుసుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం 2017లో మాజీ జడ్జి జస్టిస్ ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఐదేళ్లపాటు జయలలిత బంధువులు, సహచరులు, అధికారులు, మాజీ మంత్రులు, ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, అపోలో ఆస్పత్రి వైద్యులు, పోలీసులను విచారణ జరిపింది. 150 మందిని ప్రశ్నించింది. ఈ మేరకు కమిషన్ రిపోర్టును తయారు చేసి సీఎంకు అందజేసింది.
Also Read : మెసేజ్‌లకు రిప్లై ఇవ్వనందుకు దారుణం.. ముగ్గురు యువకులు కలిసి..