భారత్‌తో సంబంధాలకు పాక్ ఆసక్తి..ఉప ప్రధాని ఇషాక్ దార్ కీలక వ్యాఖ్యలు

భారత్-పాక్ సంబంధాలపై పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో నిర్మాణాత్మకమైన సంబంధానికి పాక్ ఎల్లప్పుడూ సుముఖంగానే ఉంటుందని తెలిపారు.

Update: 2024-06-26 12:31 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత్-పాక్ సంబంధాలపై పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో నిర్మాణాత్మకమైన సంబంధానికి పాక్ ఎల్లప్పుడూ సుముఖంగానే ఉంటుందని తెలిపారు. దక్షిణాసియాలో స్థిరత్వాన్ని కొనసాగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కొత్త పదవీకాలాన్ని ప్రారంభించినందున భారత్‌తో సంబంధాలు ఎంతో మెరగవ్వాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌తో సంబంధం చారిత్రాత్మకంగా సమస్యాత్మకంగానే ఉందని, అయితే పాకిస్తాన్ శాశ్వత శత్రుత్వాన్ని కోరుకోబోదని తెలిపారు.

2019 ఆగస్టు 5న జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం ద్వైపాక్షిక సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందన్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న అన్ని సమస్యలపై సంభాషణలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత భారత్‌పై ఉందన్నారు. దార్ వ్యాఖ్యలపై భారత్ స్పందించలేదు. అయితే జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసినప్పటి నుండి, ఇది అంతర్గత విషయమని భారతదేశం వాదిస్తోంది. 

Similar News