ప్రధాని మోడీకి పాక్ పీఎం షెబాజ్ షరీఫ్ విషెస్

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో మోడీ మరోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

Update: 2024-06-10 12:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో మోడీ మరోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోడీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తద్వారా మూడోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ పగ్గాలు చేపట్టారు. వరుసగా థర్డ్ టైమ్ ప్రధానిగా ఎన్నికైన మోడీకి దేశ, విదేశాల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అమెరికా, కెనడా, ఇటలీ వంటి అగ్రదేశాల నేతలు మోడీకి అభినందనలు తెలుపగా.. తాజాగా భారత్ పొరుగు దేశం పాకిస్థాన్ ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు.

వరుసగా మూడోసారి ప్రధానిగా ఎన్నికైన మోడీకి అభినందనలు అని పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం అట్టహాసంగా జరిగిన మోడీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి పొరుగు దేశాల నేతలను ఆహ్వానించింది. భూటాన్, నేపాల్, షెల్స్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్ దేశాల అధినేతలు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. అయితే, భారత్ పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్‌లను మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించలేదు. అయినప్పటికీ పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ మోడీకి శుభాకాంక్షలు తెలపడం గమనార్హం.  


Similar News