పాక్ కు మోడీ కావాలి.. సంచలన వ్యాఖ్యలు చేసిన వ్యాపారవేత్త

పాకిస్థాన్ కి ఇప్పుడు మోదీ లాంటి నాయకుడు కావాలని ఓ పాక్-అమెరికన్ వ్యాపారవేత్త అభిప్రాయపడ్డారు.

Update: 2024-08-25 12:55 GMT

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్థాన్ కి ఇప్పుడు మోదీ లాంటి నాయకుడు కావాలని ఓ పాక్-అమెరికన్ వ్యాపారవేత్త అభిప్రాయపడ్డారు. సాజిత్ తరార్ అనే పాక్-అమెరికన్ వ్యాపారవేత్త ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా భారత్ అనేక రంగాలలో దూసుకు పోతుందని, దానికి మోదీ లాంటి నాయకుడే కారణం అన్నారు. ముఖ్యంగా అమెరికాలో టెక్ దిగ్గజాల పెరుగుదలలో భారత్ ముందు ఉందని, దీనిని మోదీ మరింత బలోపేతం చేస్తున్నారని అన్నారు. మోదీని చూసి పాక్ ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్ కు మోదీ వంటి ముందుచూపు గల నాయకుడు అత్యవసరం అని అభిప్రాయపడ్డారు. పాక్ ఇప్పటికిప్పుడు విద్యపై దృష్టి సారిస్తే దాని ఫలాలు భవిష్యత్తులో అందుతాయని అన్నారు. ఇందుకు ఉదాహరణ నెహ్రూ స్థాపించిన ఐఐటీ, ఐఐఎంలేనని తెలియజేశారు. రానున్న అమెరికా ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు తరార్.  


Similar News