Kashmir terror attack: జమ్ముకశ్మీర్ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా ప్రమేయం

జమ్ముకశ్మీర్‌ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది.

Update: 2024-10-21 05:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. గాందర్‌బల్‌ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడి వెనుక లష్కరే తోయిబా అనుబంధ శాఖ ప్రమేయం ఉన్నట్లుగా ఇంటెలిజెన్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. ‘ది రెసిస్టన్స్‌ ఫ్రంట్‌’(TRF) ఉగ్రదాడికి పాల్పడినట్లుగా స్థానిక మీడియాల్లో కథనాలు వస్తున్నయి. టీఆర్‌ఎఫ్‌ చీఫ్ షేక్‌ సజ్జద్‌ గుల్‌ ఈ దాడికి సూత్రధారి అని తెలుస్తోంది. కాగా..అతడి ఆదేశానుసారం ఉగ్రవాదులు కశ్మీరీ, కశ్మీరేతరులను లక్ష్యంగా చేసుకుని ప్రణాళిక అమలు చేసినట్లుగా అధికారులు పేర్కొన్నారు.

ఏడుగురు మృతి

ఇకపోతే, గాందర్‌బల్‌ జిల్లాలోని గుండ్‌ వద్ద శ్రీనగర్‌ - లేహ్‌ జాతీయ రహదారిలో సొరంగ నిర్మాణపనులు చేస్తున్న ప్రైవేటు కంపెనీ కార్మికుల కోసం తాత్కాలిక నివసాలు ఏర్పాటు చేసింది. ఆదివారం సాయంత్రం కార్మికులు, సిబ్బంది పనులు పూర్తి చేసుకుని వస్తుండగా.. ఇద్దరు ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. కాగా.. ఆ కాల్పులలో ఏడుగురు చనిపోగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. ఉగ్రదాడిని ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సైతం ఈ ఘటనపై స్పందించారు. దాడికి బాధ్యులైన ఉగ్రవాదులను విడిచిపెట్టబోమని పేర్కొన్నారు.


Similar News