Ayushman Cards : ‘ఆయుష్మాన్ వయ వందన’ కార్డులకు దరఖాస్తుల వెల్లువ
దిశ, నేషనల్ బ్యూరో : 70 ఏళ్లకు పైబడిన వారికి ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పించే ‘ఆయుష్మాన్ వయ వందన’(Ayushman Vaya Vandana) కార్డుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.
దిశ, నేషనల్ బ్యూరో : 70 ఏళ్లకు పైబడిన వారికి ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పించే ‘ఆయుష్మాన్ వయ వందన’(Ayushman Vaya Vandana) కార్డుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. వయోవృద్ధులకు ఆరోగ్య బీమా ప్రయోజనాన్ని అందించే ఈ స్కీంను ప్రధానమంత్రి నరేంద్రమోడీ రెండు వారాల క్రితమే ప్రారంభించారు. ఇప్పటివరకు ‘ఆయుష్మాన్ వయ వందన’ కార్డుల(Ayushman Cards) కోసం దాదాపు 5.12 లక్షల మంది సీనియర్ సిటిజెన్లు దరఖాస్తు చేసుకున్నారు.
వీటిలో 4.64 లక్షల దరఖాస్తులను అధికారులు ఆమోదించగా, 47,916 దరఖాస్తులు పెండింగ్ దశలో ఉన్నాయి. తగిన అర్హతలు, ధ్రువపత్రాలు లేకపోవడంతో 141 దరఖాస్తులను తిరస్కరించారు. మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో అత్యధికంగా 1.66 లక్షల దరఖాస్తులు, కేరళలో 1.28 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లో 69వేల అప్లికేషన్లు, గుజరాత్‌లో 25వేల అప్లికేషన్లు వచ్చాయి. ఈ స్కీం ద్వారా దేశవ్యాప్తంగా 4.5 కోట్ల కుటుంబాలకు చెందిన దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజెన్లకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.