China : చైనాలో పిల్లుల్లో ప్రాణాంతక వైరస్.. బెంబేలెత్తున్న ప్రజలు
చైనా(China)లో హెచ్ఎంపీవీ(HMPV) అనే ప్రాణాంతక వైరస్ కలకలం రేగుతున్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్ : చైనా(China)లో హెచ్ఎంపీవీ(HMPV) అనే ప్రాణాంతక వైరస్ కలకలం రేగుతున్న విషయం తెలిసిందే. కాగా మరో విషయం కూడా చైనీయులను బెంబేలెత్తిస్తోంది. అక్కడి పిల్లుల్లో(Cats) 'ఫీలైన్ ఇన్ఫెక్షియస్ పెరిటోనిటీస్'(Feline Infectious Peritonitis) అనే ప్రాణాంతక వ్యాధి సోకుతున్నట్టు తెలుస్తోంది. పిల్లుల్లో మాత్రమే సోకే ఈ వ్యాధిని ఫీలైన్ కరోనా వైరస్(Felaine Corona Virus) అని కూడా అంటారు. పిల్లుల తెల్ల రక్త కణాల మీద దాడి చేసే ఈ వైరస్ ను కట్టడి చేసేందుకు ఖరీదైన మందులు వాడాల్సి ఉంటుంది. దీంతో అక్కడి ప్రజలు వారి పెంపుడు పిల్లులకు మనుషులకి ఇచ్చే కరోనా మందులు వాడుతున్నట్టు సమాచారం. కాగా ఈ మందులు వాడుతున్నప్పుడు తమ పిల్లుల ఆరోగ్యం బాగయిందంటూ కొంతమంది తెలపగా.. మరికొంతమంది మాత్రం మనుషులకు వాడే మందులు పిల్లులకు వాడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి మహమ్మారి వ్యాధులకు చైనా పుట్టినిల్లుగా తయారైందని పలువురు నెటిజన్స్ పోస్టులు పెడుతుండటం గమనార్హం.