AAP Belt Blows : బీజేపీ కొరడా దెబ్బలు..ఆప్ బెల్టు దెబ్బలు..వైరల్ గా ఘటన

దేశంలో అధికార పార్టీలపై ప్రతిపక్షాలు వినూత్న నిరసనలకు దిగుతున్న తీరు జనాల్లో ఆసక్తి రేపుతున్నాయి.

Update: 2025-01-06 11:46 GMT

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో అధికార పార్టీలపై ప్రతిపక్షాలు వినూత్న నిరసనలకు దిగుతున్న తీరు జనాల్లో ఆసక్తి రేపుతున్నాయి. మొన్న త‌మిళ‌నాడులో అన్నా యూనివర్సీటీలో విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనను నిరసిస్తూ డీఎంకే ప్రభుత్వాని(Government of Tamil Nadu)కి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర బీజేపీ(Bjp) అధ్యక్షుడు అన్నామలై (Annamalai)తన ఒంటిపై కొరడా దెబ్బలు(Whippings) కొట్టుకుని దేశ వ్యాప్తంగా సంచలనం రేపారు. అన్నామలై వింత నిరసన మరువక ముందే గుజరాత్ లో ఆమ్ఆద్మీపార్టీ(AAP) నేత ఒకరు అదే తరహా నిరసనకు దిగడం వైరల్ గా మారింది.

ఇద్దరు నాయకులు కూడా తమ తమ రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న దాడుల నేపధ్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. కాకపోతే అన్నామలై కొరడా దెబ్బలు కొట్టుకుంటే ఆప్ నేత బెల్టుతో ఒంటిపై దెబ్బ(Belt Blows)లు కొట్టుకున్నాడు. గుజరాత్ లో మహిళలపై పెరిగిపోతున్న దాడులను నిరసిస్తూ ఆప్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆప్ నేత గోపాల్ ఇటాలియా(Gopal Italia) గుజరాత్ ప్రభుత్వాని (Gujarat Government)కి వ్యతిరేకంగా తన బెల్టుతో తానే కొట్టుకున్నాడు.

ఆకస్మాత్తుగా వేదికపై తన ప్రసంగాన్ని మధ్యలో ఆపేసిన గోపాల్ తన ప్యాంటు బెల్టును తీసి కొట్టుకోవడం ప్రారంభించాడు. వెంటనే వేదికపై ఉన్న ఇతర నేతలు అతడి వద్ధ నుంచి బెల్టును లాగేసుకున్నారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Tags:    

Similar News