Manish Sisodia Bai: సత్యం గెలిచిందని ఆప్ ఆనందం.. సంతోషపడకండని బీజేపీ వార్నింగ్

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరైంది. కాగా, సుప్రీంకోర్టు తీర్పుపై ఆమ్ ఆద్మీ పార్టీ హర్షం వ్యక్తం చేసింది.

Update: 2024-08-09 09:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరైంది. కాగా, సుప్రీంకోర్టు తీర్పుపై ఆమ్ ఆద్మీ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. “సత్యం గెలిచింది” అని ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చడ్డా సోషల్ మీడియా ఎక్స్ లో పేర్కొన్నారు. "ఢిల్లీ విద్యా విప్లవ వీరుడు మనీశ్ సిసోడియాకు బెయిల్ లభించడంతో దేశం మొత్తం సంతోషంగా ఉంది." అని ఆయన చెప్పుకొచ్చారు. ఢిల్లీ మంత్రి అతిశీ సంతోషం వ్యక్తం చేశారు. ఇదే కేసులో మార్చి నుంచి జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా త్వరలోనే బయటకు వస్తారని సంతోషం వ్యక్తం చేశారు. ‘‘17 నెలలు జైలులో ఉన్న మనీశ్ సిసోడియాకు బెయిల్ లభించింది. ఇది సత్య గెలుపు. తప్పుడు కేసులో ఆయన్ని ఇరికించారు. ఇప్పుడు, ఇక వేచి చూస్తున్నాం. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా త్వరలోనే బయటకు రానున్నారు. ఇది ఢిల్లీ ప్రజల విజయం” అని అతిశీ చెప్పుకొచ్చారు. "కేంద్రం నియంతృత్వానికి చెంపదెబ్బ" అని ఆప్ నేత సంజయ్ సింగ్ అన్నారు.

సంతోష పడకండి.. ఆప్ కు బీజేపీ వార్నింగ్

సిసోడియా బెయిల్ అంశంపై కేజ్రీవాల్ ను, ఆప్ ను లక్ష్యంగా చేసుకుని బీజేపీ విమర్శలు గుప్పించింది. కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. “మద్యం కుంభకోణం కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ లభించింది. బీజేపీ ఎప్పుడూ కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తుందని.. కానీ నిందితుడికి బెయిల్ రావడం అంటే అభియోగాల నుంచి విముక్తి పొందడం కాదు. విచారణ జరగుతోంది.కోర్టు సాక్ష్యాలను చూస్తుంది’’ అని బీజేపీ ఢిల్లీ చాఫ్ వీరేంద్ర సచ్ దేవా అన్నారు. బీజేపీ ఎంపీ యోగేంద్ర చందోలియా ఆప్ పై మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం కాషాయ పార్టీ "అబద్ధం" చెబుతోందని చందోలియా విమర్శించారు.


Similar News