Omar Abdullah : రెండు సీట్ల నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారో చెప్పేసిన ఒమర్ అబ్దుల్లా

దిశ, నేషనల్ బ్యూరో : కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి రెండు స్థానాల నుంచి పోటీ చేస్తుండటంపై నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-06 16:57 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి రెండు స్థానాల నుంచి పోటీ చేస్తుండటంపై నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రెండు చోట్ల నుంచి బరిలోకి దిగడం సహజమైన నిర్ణయమేనని, అందులో పెద్ద విడ్డూరమేం లేదని ఆయన స్పష్టం చేశారు.

‘‘నేను ఇటీవలే లోక్‌సభ ఎన్నికల్లో బారాముల్లా పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయాను. ఇప్పుడు నేను పోటీ చేస్తున్న బుడ్గాం అసెంబ్లీ స్థానం బారాముల్లా పార్లమెంటు స్థానం పరిధిలోకే వస్తుంది. నేను పోటీ చేస్తున్న మరో అసెంబ్లీ స్థానం పేరు గండేర్బల్. అక్కడి నుంచి గతంలో అసెంబ్లీకి ఎన్నికైన ట్రాక్ రికార్డు నాకుంది. మా తాత, నాన్న కూడా గండేర్బల్ నుంచి గెలిచారు. అందుకే నాకు ఈ రెండు స్థానాలూ సహజమైన ఆప్షన్స్. రెండుచోట్ల గెలవాలనేది నా టార్గెట్’’ అని ఒమర్ అబ్దుల్లా వివరించారు. తమ నుంచి లాక్కున్న ఆత్మగౌరవాన్ని మళ్లీ సాధించే ప్రయత్నంలో ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.


Similar News