ఇక రసవత్తరంగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు.. రీఎంట్రీ ఇచ్చిన ఒమర్ అబ్దుల్లా

జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Update: 2024-08-25 11:54 GMT

దిశ, వెబ్ డెస్క్ : జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా తిరిగి ఎన్నికల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నంత వరకు తాను ఎన్నికల్లో పోటీ చేయనని ఒమర్ గతంలో ప్రకటించారు. అయితే తాజాగా మనసు మార్చుకున్న ఒమర్ అబ్దుల్లా.. రానున్న ఎన్నికల్లో తాను గాంధర్ బల్ నియోజకవర్గం నుండి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించి, జమ్మూ కాశ్మీర్ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. ఒమర్ ఇదే గాంధర్ బల్ స్థానం నుండి పోటీ చేసి గెలిచి సీఎం అయ్యారు. కాగా 2009 నుండి 2015 వరకు ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ సీఎంగా ఉన్నారు. అయితే 2022 ఎన్నికల్లో పీడీపీ అభ్యర్థి చేతిలో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఇక జమ్మూ కాశ్మీర్ లో మూడు విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 2, అక్టోబర్ 1న పోలింగ్ జరగగా.. అక్టోబర్ 4న ఎన్నికల ఫలితాలు రానున్నాయి.  


Similar News