Omar abdhullah: రెండో అసెంబ్లీ స్థానానికీ ఒమర్ అబ్దుల్లా నామినేషన్.. బుద్గాం సెగ్మెంట్ నుంచి పోటీ

ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బుద్గామ్ స్థానం నుంచి కూడా నామినేషన్ దాఖలు చేశారు.

Update: 2024-09-05 14:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బుద్గామ్ స్థానం నుంచి కూడా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న ఆయన బుధవారం గందర్‌బల్ నుంచి నామినేషన్ వేశారు. రెండు స్థానాల్లో పోటీ చేయడంపై ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ..‘రెండు సెగ్మెంట్ల నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం బలహీనత కాదు.. ఎన్సీ బలానికి నిదర్శనం.. అనంత్ నాగ్ నుంచి శ్రీనగర్ వరకు ఎన్సీకి అనుకూలంగా కనపడుతున్నాయి’ అని తెలిపారు. గత ఐదేళ్ల నుంచి కశ్మీర్‌లో అవినీతి ఆరోపణలు వచ్చాయని అధికారంలోకి రాగానే వాటన్నింటిపై విచారణ జరుపుతామని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుపై ప్రజలు సంతోషంగా లేరని చెప్పారు. కాంగ్రెస్, ఎన్సీ కూలమి విజయం సాధించడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. 


Similar News