Odisha: ఒడిశాలో స్క్రబ్ ఇన్‌ఫెక్షన్‌తో ఆరుగురు మృతి..

ఒడిశాలో స్క్రబ్ టైఫస్ ఇన్‌ఫెక్షన్‌తో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

Update: 2023-09-15 11:36 GMT

భువనేశ్వర్ : ఒడిశాలో స్క్రబ్ టైఫస్ ఇన్‌ఫెక్షన్‌తో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. బర్‌గఢ్ జిల్లాలో ఐదుగురు, సుందేర్‌గఢ్ జిల్లాలో ఒకరు మృతిచెందారు. ఇప్పటివరకు సుందేర్‌గఢ్ జిల్లాలో 132 మందికి ఈ ఇన్‌ఫెక్షన్ సోకింది. వీరంతా కోలుకోగా, ఓ వ్యక్తి మాత్రం చనిపోయాడని వైద్యాధికారులు తెలిపారు. ఈ మరణాలతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వ్యాధి కట్టడిపై, రోగులకు చికిత్సపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. స్క్రబ్ టైఫస్‌ ఇన్ఫెక్షన్‌ను బుష్ టైఫస్‌ అని కూడా పిలుస్తారు. ఒరియెంటియా సుసుగమోషి అనే బ్యాక్టీరియా కారణంగా ఇది వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా సోకిన పురుగులు కుట్టినప్పుడు మనుషుల్లోనూ ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది. అడవులు, పంట పొలాల్లో ఉన్న వాళ్లకే ఇది ఎక్కువగా సోకే అవకాశాలు ఎక్కువ. ఈ ఇన్ఫెక్షన్ సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, దద్దర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి.


Similar News