'ఒక్క ఓబీసీని కూడా కాంగ్రెస్ ప్రధానిగా చేయలేదు'

మహిళా రిజర్వేషన్ బిల్లులో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) కోటా లేదన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపణలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తోసిపుచ్చారు.

Update: 2023-09-21 12:39 GMT

న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్ బిల్లులో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) కోటా లేదన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపణలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తోసిపుచ్చారు. వాస్తవాలను, కాంగ్రెస్ చరిత్రను గుర్తించాలని రాహుల్‌కు సూచిస్తూ గురువారం ఓ ట్వీట్ చేశారు. దశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఒక్క ఓబీసీని కూడా ప్రధానమంత్రిగా చేయలేదన్నారు. ‘‘ఓబీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోడీ ఇప్పుడు దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు. మోడీ టీమ్‌లోని కేంద్ర మంత్రివర్గంలో రికార్డు స్థాయిలో 35 శాతం మంది ఓబీసీలు ఉన్నారు’’ అని ట్వీట్‌లో రిజిజు రాశారు.

‘‘చౌదరి చరణ్ సింగ్, దేవెగౌడ వంటి ఓబీసీ నాయకులను కాంగ్రెస్ వ్యతిరేకించింది. మండల్ కమిషన్‌ను రాజీవ్ గాంధీ వ్యతిరేకించారు’’ అని ఆయన విమర్శించారు. ‘‘ప్రస్తుతం భారత ప్రభుత్వంలో పనిచేస్తున్న కార్యదర్శుల బ్యాచ్ ఒకటి 1992లో తమ కెరీర్ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు వాళ్లు కార్యదర్శుల బ్యాచ్‌లో ఓబీసీ ప్రాతినిధ్యం గురించి ఎందుకు పట్టించుకోలేదు ?’’ అని ప్రశ్నించారు.


Similar News