Nipah Virus: నిఫా వైరస్ కలకలం.. మినీ లాక్ డౌన్ దిశగా కేరళ

రెండు రోజుల క్రితం కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ కొత్త వేరియంట్ లక్షణాలతో ఇద్దరు మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి తెలిపింది.

Update: 2023-09-14 03:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: రెండు రోజుల క్రితం కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ కొత్త వేరియంట్ లక్షణాలతో ఇద్దరు మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి తెలిపింది. దీంతో చనిపోయిన వారి బంధువులను పరిక్షించిన అధికారులు.. వారికి కూడా లక్షణాలు ఉన్నట్లు స్పష్టం చేశారు. దీంతో మొత్తం ఎంతమందికి ఈ లక్షణాలు ఉన్నాయి. వైరస్ వచ్చిన వారు ఎక్కడెక్కడ తిరిగారనే కాంటాక్ట్ ను ట్రాక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ డెంటల్ ఆస్పత్రిలో కూడా ఈ వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. మొత్తంగా కేరళ రాష్ట్రంతో ప్రస్తుతం 75 మంది దాకా వైరస్ బారిన పడ్డారు.

దీంతో అప్రమత్తమైన ప్రజలు.. తమ గ్రామంలోకి ఎవరు రావొద్దని ఆంక్షలు పెట్టారు. అలాగే కేరళ రాష్ట్రానికి అనుకుని ఉన్న కర్ణాటక బోర్డర్ కూడా మూసినట్లు తెలుస్తుంది. దీంతో ఆ రాష్ట్రంలో మినీ లాక్ డౌన్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా పర్యాటక ప్రాంతమైన కేరళకు ఎవరు రాకుండా చూసుకొవాలని అధికారులు అంటున్నారు. లేదంటే కరోనా వంటి మరో విపత్తును దేశం ఎదుర్కోవాల్సి వస్తుందని.. అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News