పేదలకు మోడీ గుడ్ న్యూస్.. తొలి కేబినెట్ భేటీలో సంచలన నిర్ణయం

మోడీ 3.0 సర్కార్ లో కేంద్ర కేబినెట్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2024-06-10 13:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రంలో కొలువుదీరిన నరేంద్ర మోడీ 3.0 సర్కార్ ప్రజలకు బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ చెప్పింది. సోమవారం ఉదయం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోడీ.. ఆ వెంటనే దేశవ్యాప్తంగా ఉన్న 9.30 కోట్ల మంది రైతులకు రూ. 20 వేల కోట్ల ఆర్థిక సాయం అందించే పీఎం కిసాన్ నిధి విడుదలకు సంబంధించిన ఫైల్ పై తొలి సంతకం చేశారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన తొలి కేబినెట్ భేటీలో మరో కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు నిర్మించేందుకు ఆర్థిక సహకారం ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఢిల్లీ లోక్ కల్యాణ్ మార్గ్ లోని మోడీ నివాసంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఈ భేటీలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. ఈ మంత్రివర్గ భేటీ అనంతరం నిన్న ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలను కేటాయించే అవకాశం ఉంది. అయితే ఎవరికి ఏ శాఖ దక్కబోతున్నదో అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News