Peger Attacks : పేజర్ దాడులపై నెతన్యాహు సంచలన ప్రకటన

ఇటీవల లెబనాన్, సిరియాలో భారీ ఎత్తున జరిగిన పేజర్ దాడుల(Peger Attacks)పై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Israel PM Benjamin Netanyuhu) సంచలన ప్రకటన చేశారు.

Update: 2024-11-10 17:35 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల లెబనాన్, సిరియాలో భారీ ఎత్తున జరిగిన పేజర్ దాడుల(Peger Attacks)పై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Israel PM Benjamin Netanyuhu) సంచలన ప్రకటన చేశారు. ఆ దాడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తానే అని నెతన్యాహు అంగీకరించారు. దేశవ్యాప్తంగా పేజర్లు పేలిపోయిన ఘటనలో అనేకమంది హెజ్బొల్లా(Hijjbolla) నేతలు ప్రాణాలు కోల్పోగా.. వేలాది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడి వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని లెబనాన్, సిరియా తీవ్ర ఆరోపణలు చేశాయి. ఈ ఘటనపై లెబనాన్ ఇటీవల ఐరాస(UNO)కు ఫిర్యాదు కూడా చేసింది. ఈ క్రమంలో హెజ్బొల్లాలే లక్ష్యంగా పేజర్ దాడుల ఆపరేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తానేనని నెతన్యాహు ప్రకటించడం గమనార్హం. 

Tags:    

Similar News