Jharkhand Elections: ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు.. ఓటర్లనుద్దేశించి అగ్రనేతల ట్వీట్లు

ఓటర్లనుద్దేశింది అమిత్ షా, హేమంత్ సోరెన్, మల్లికార్జున ఖర్గే ఎక్స్ వేదికగా పోస్టులు చేశారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని బలోపేతం చేసేందుకు ఓటర్లంతా తమ విలువైన ఓటుహక్కును వినియోగించుకోవాలని మల్లికార్జున ఖర్గే కోరారు.

Update: 2024-11-13 05:03 GMT

దిశ, వెబ్ డెస్క్: ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలవ్వగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ లైన్లలో బారులు తీరారు. తొలివిడతలో 15 జిల్లాల్లోని 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. 683 మంది బరిలో నిలిచారు. 15,344 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 1.37 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో బరిలో ఉన్న ప్రధాన అభ్యర్థుల్లో మాజీ సీఎం చంపయీ సోరెన్, కాంగ్రెస్ నేత బన్నా గుప్తా, ఎంపీ మహూవా మాఝీ, మాజీ సీఎం మధు కోడా భార్య గీతా, మాజీ సీఎం రఘుబర్ దాస్ కోడలు ఉన్నారు.

ఓటర్లనుద్దేశింది అమిత్ షా, హేమంత్ సోరెన్, మల్లికార్జున ఖర్గే ఎక్స్ వేదికగా పోస్టులు చేశారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని బలోపేతం చేసేందుకు ఓటర్లంతా తమ విలువైన ఓటుహక్కును వినియోగించుకోవాలని మల్లికార్జున ఖర్గే కోరారు.

ఝార్ఖండ్ ప్రజాస్వామ్యంలో గొప్ప పండుగ జరుగుతున్న రోజు అని, రాష్ట్రం ఏర్పడి 24 ఏళ్లు పూర్తవుతున్న వేళ.. ఈ ఎన్నికలు మరింత ముఖ్యమైనవి కాబోతున్నాయని, ఓటర్లు ఆలోచించి తమ తీర్పును చెప్పాలని మాజీ సీఎం హేమంత్ సోరెన్ కోరారు.

అవినీతి, చొరబాట్లు లేని అభివృద్ధి చెందిన ఝార్ఖండ్‌ను నిర్మించేందుకు ఝార్ఖండ్‌లో మొదటి దశలో ఓటు వేయనున్న ఓటర్లందరూ రికార్డు స్థాయిలో ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి రౌండ్‌ పోలింగ్‌ నేడు. ఈ ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లందరూ పూర్తి ఉత్సాహంతో ఓటు వేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా తొలిసారి ఓటు వేయబోతున్న నా యువ మిత్రులందరికీ నా అభినందనలు అని ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.


Tags:    

Similar News