Bomb Threat: ముంబయి ఎయిర్‌పోర్టును పేల్చివేసేందుకు కుట్ర ?

దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పేల్చివేసేందుకు కుట్ర జరుగుతోందని గుర్తు తెలియని వ్యక్తి నుంతి ఫోన్ కాల్ రావడంతో.. ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు.

Update: 2024-11-14 06:35 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల దేశంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే వాటి వెనుక ఉన్నది ఒక రచయిత అని తేలడంతో.. పోలీసులు అతనికోసం గాలిస్తున్నారు. తాజాగా మరోసారి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పేల్చివేసేందుకు కుట్ర జరుగుతోందని గుర్తు తెలియని వ్యక్తి నుంతి ఫోన్ కాల్ రావడంతో.. ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. సీఐఎస్ఎఫ్ కంట్రోల్ రూమ్ కు ఈ కాల్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

ముంబై నుంచి అజర్ బైజాన్ వెళ్తున్న ప్రయాణికుడి వద్ద బాంబులున్నాయని ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తి చెప్పాడని అధికారులు తెలిపారు. సీఐఎస్ఎఫ్, సహర్ పోలీసులు అప్రమత్తమై.. ముంబై ఎయిర్ పోర్టు ప్రాంగణంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. 

Tags:    

Similar News