ఆ ఆత్మహత్యలకు నీట్ ఫలితాలతో సంబంధం లేదు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

నీట్ ఫలితాల వివాదం నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-06-14 10:19 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: నీట్-యూజీసీ 2024 పరీక్షలో అక్రమాల ఆరోపణల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్​టీఏ)కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నీట్ పరీక్షలో అక్రమాల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై శుక్రవారం సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషన్ తరపు వాదనలు విన్న న్యాయస్థానం ఈ పిటిషన్ పై రెండువారాల్లో తమ స్పందన తెలియజేయాలని కేంద్రం, ఎన్టీఏతో పాటు సీబీఐ, బిహార్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా పటిషనర్ తరపున వాదనలు వినిపించిన ఓ న్యాయవాది రాజస్థాన్ లోని కోటా నగరంలో విద్యా్ర్థుల ఆత్మహత్యల అంశాన్ని ప్రస్తావించగా దీనిపై సర్వోన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేంది. కోటాలో ఆత్మహత్యలకు నీట్ యూజీ 2024 ఫలితాలతో సంబంధం లేదని అనవసర భావోద్వేగ వాదనలు ఇక్కడ చేయవద్దనంటూ సున్నితంగా మందలించింది. అనంతరం తదుపరి విచారణ జూలై 8కి వాయిదా వేసింది. నీట్‌ పరీక్షకు సంబంధించి దాఖలైన ఇతర పెండింగ్‌ పిటిషన్లతో కలిపి దీన్ని విచారిస్తామని స్పష్టం చేసింది.

Tags:    

Similar News