నీట్ - యూజీ పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ - యూజీ 2024 పరీక్షల దరఖాస్తు గడువును పెంచింది. అభ్యర్థులు మార్చి 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
దిశ, నేషనల్ బ్యూరో: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ - యూజీ 2024 పరీక్షల దరఖాస్తు గడువును పెంచింది. అభ్యర్థులు మార్చి 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంతకుముందు దరఖాస్తు చివరి తేదీ మార్చి 9 వరకు ఉండగా, కొత్తగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రిజిస్ట్రేషన్ తేదీని పెంచారు. దరఖాస్తు చేసేటప్పుడు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే, అభ్యర్థులు NEET UG హెల్ప్‌లైన్ నెం 011-40759000లో సంప్రదించవచ్చు/లేదా neet@nta.ac.inకి ఈమెయిల్ చేయవచ్చని బోర్డు పేర్కొంది. అభ్యర్థులు పూర్తి వివరాలను తెలుసుకోడానికి అధికారిక వెబ్‌సైట్ https://exams.nta.ac.in/NEET/ ను చూడవచ్చు. ప్రవేశ పరీక్ష మే 5న జరుగుతుంది. ఈ ఏడాది పరీక్షకు దాదాపు 25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.