Prashant Kishor : ప్రశాంత్ కిషోర్ పార్టీ గుర్తు "స్కూల్ బ్యాగ్"

ప్రశాంత్ కిషోర్‌(Prashant Kishor) కు చెందిన "జన్‌ సురాజ్‌"(Jan Suraj) పార్టీ గుర్తుగా "స్కూల్ బ్యాగ్"(School Bag)ను ఎన్నికల సంఘం (EC) కేటాయించింది.

Update: 2024-11-02 15:23 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రశాంత్ కిషోర్‌(Prashant Kishor) కు చెందిన "జన్‌ సురాజ్‌"(Jan Suraj) పార్టీ గుర్తుగా "స్కూల్ బ్యాగ్"(School Bag)ను ఎన్నికల సంఘం (EC) కేటాయించింది. ప్రస్తుతం జరగనున్న బీహార్‌(Bihar) ఉప ఎన్నికల్లో ఈ గుర్తుపై జన్ సురాజ్ పోటీ చేయబోతుంది. తరారీ, రామ్‌గఢ్, బెలగంజ్, ఇమామ్‌గంజ్ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించడమే కాకుండా ప్రశాంత్‌ కిషోర్‌ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ గుర్తుగా 'స్కూల్ బ్యాగ్'ను ఎందుకు ఎంచుకున్నారో వివరించారు. గత 35 ఏళ్లలో ఆర్జేడీ, జేడీయూ అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్‌ కుమార్ ప్రభుత్వ పాలనలో బీహార్లో పిల్లలు బడి మానేసే విధంగా వారిని కాదు పేదరికంలోకి నెట్టి, వారిని బాల కార్మికులుగా మార్చారని విమర్శించారు. బీహార్ ప్రజల పేదరికాన్ని అంతం చేయాలన్నా, వలసలు ఆగాలన్నా స్కూల్ బ్యాగ్ ఒక్కటే మార్గమన్నది జన్ సురాజ్ ఆలోచన అన్నారు. అందుకే ఎన్నికల చిహ్నంగా స్కూల్ బ్యాగ్‌ను ఎంచుకున్నామని ఆయన వెల్లడించారు. మరోవైపు కులం, ఉచిత రేషన్ ఆధారంగా రాజకీయ పార్టీలకు మద్దతు ఇవ్వడం మానేయాలని బీహార్ ప్రజలను ప్రశాంత్‌ కిషోర్‌ కోరారు. రాష్ట్రంలో కొనసాగుతున్న వెనుకబాటుకు ఈ విధమైన ఓటింగ్ ప్రవర్తనే కారణమని ఆరోపించారు. మీకు, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలంటే మీరు ‘జాత్’, ‘భాత్’ కు ఓటు వేయడం మానాలని బీహార్‌ ప్రజలకు ప్రశాంత్ కిషోర్ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News