Cough Syrup: రూ.8 కోట్ల విలువైన నిషేధిత దగ్గు సిరప్ సీజ్.. పశ్చిమ బెంగాల్‌లో స్వాధీనం

పశ్చిమ బెంగాల్ పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం 54,000 నిషేధిత దగ్గు మందు బాటిళ్లను స్వాధీనం చేసుకుంది.

Update: 2024-11-02 15:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) బృందం 54,000 నిషేధిత దగ్గు మందు బాటిళ్లను(Cough syrup) స్వాధీనం చేసుకుంది. పక్కా సమాచారం మేరకు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 1 మధ్య ఎస్టీఎఫ్ బృందం మురులిగాచ్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ (Forest check post)దగ్గర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నిషేధిత దగ్గు సిరప్‌తో పాటు వాటిని రవాణా చేయడానికి ఉపయోగించే ట్రక్కును సీజ్ చేశారు. అసోంలోని చిరాంగ్‌కు చెందిన అబూ తాహెర్‌ (Abu thaher) అనే వ్యక్తిని అరెస్టు చేశారు. తాహెర్ జార్ఖండ్(Jharkhand) నుంచి అసోం(Assam)కు రవాణా చేసే అంతర్-రాష్ట్ర మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో భాగమని విచారణలో వెల్లడైంది. సీజ్ చేసిన దగ్గు బాటిళ్ల విలువ సుమారు రూ. 8కోట్లు ఉంటుందని అధికారులు అంచనావేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్టీఎఫ్ పోలీసులువెల్లడించారు. కాగా, ఈ ఏడాది మేలో ఎస్టీఎఫ్ పోలీసులు కోల్‌కతాలో 2.5 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుని ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. 

Tags:    

Similar News