Naxalism: ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజం అంతం అవుతుంది.. సీఎం విష్ణు దేవ్ సాయి

ఛత్తీస్‌గఢ్‌లో 31 మంది నక్సలైట్లను ఎన్‌కౌంటర్ చేయడంపై ఆ రాష్ట్ర సీఎం విష్ణు దేవ్ సాయి హర్షం వ్యక్తం చేశారు.

Update: 2024-10-05 13:20 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌లో 31 మంది నక్సలైట్లను ఎన్‌కౌంటర్ చేయడంపై ఆ రాష్ట్ర సీఎం విష్ణు దేవ్ సాయి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో త్వరలోనే నక్సలిజం అంతమై శాంతి నెలకొంటుందని తెలిపారు. శనివారం ఆయన రాయ్ పూర్‌లో మీడియాతో మాట్లాడారు. ‘భద్రతా బలగాలు గొప్ప విజయాన్ని సాధించాయి. 31 మంది నక్సల్స్‌ను చంపారు. గతంలో ఉన్న 29 రికార్డును అధిగమించారు. సైనికులు చూపిన ధైర్యానికి అభినందనలు. ఖచ్చితంగా ఒక రోజు నక్సలిజం ముగిసి ఛత్తీస్‌గఢ్‌లో శాంతి నెలకొంటుంది’ అని వ్యాఖ్యానించారు. ఇది మావోయిస్టులకు పెద్ద దెబ్బ అని తెలిపారు. కాగా, నారాయణపూర్-దంతెవాడ సరిహద్దులో 31 మంది నక్సలైట్లు హతమైన విషయం తెలిసిందే. మరోవైపు, ఈనెల 7న నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో భద్రత, అభివృద్ధిని సమీక్షించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. 


Similar News

టమాటా @ 100