Nallu Indrasena Reddy:మిజోరాం గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనారెడ్డికి అదనపు బాధ్యతలు

త్రిపుర గవర్నర్(Tripura Governor) నల్లు ఇంద్రసేనారెడ్డి(Nallu Indrasena Reddy) మిజోరాం గవర్నర్‌(Mizoram Governor)గా నియమితులయ్యారు.

Update: 2024-09-27 21:58 GMT

దిశ, వెబ్‌డెస్క్:త్రిపుర గవర్నర్(Tripura Governor) నల్లు ఇంద్రసేనారెడ్డి(Nallu Indrasena Reddy) మిజోరాం గవర్నర్‌(Mizoram Governor)గా నియమితులయ్యారు.ఈ మేరకు రాష్ట్రపతి కార్యలయం(Rashtrapati Bhavan) అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.ప్రస్తుతం మిజోరాం గవర్నర్‌గా ఉన్న కంభంపాటి హరిబాబు(Kambhampati Hari Babu) కొన్ని రోజులుగా సెలవులో ఉన్నారు.ఆయన అనారోగ్యంతో బాధపడుతన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంద్రసేనారెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది.ఇంద్రసేనా రెడ్డి తెలంగాణలోని సూర్యాపేట(Suryapet) జిల్లాకు చెందిన వారు. ఆయన గతంలో మలక్‌పేట్ నియోజకవర్గం(Malakpet Constituency) నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు.


Similar News