J&K: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశలో 57.31 శాతం ఓటింగ్

గందర్‌బాల్, బుద్గాం, శ్రీనగర్, జమ్మూ ప్రాంతాలలోని రాజౌరి, రియాసి, పూంచ్ వంటి ఆరు జిల్లాల్లో రెండవ దశ పోలింగ్ జరిగింది.

Update: 2024-09-27 16:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌ దశాబ్దం తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటీవల ముగిసిన రెండో దశ పోలింగ్‌లో 57.31 శాతం ఓటింగ్ నమోదైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది. ఈసీఐ డేటా ప్రకారం.. గందర్‌బాల్, బుద్గాం, శ్రీనగర్, జమ్మూ ప్రాంతాలలోని రాజౌరి, రియాసి, పూంచ్ వంటి ఆరు జిల్లాల్లో రెండవ దశ పోలింగ్ జరిగింది. కంగన్‌లో అత్యధికంగా 72.18 శాతం, హబ్బా కదల్ 19.81 శాతంతో కనిష్ట పోలింగ్‌ని నమోదు చేశాయి. ఇతర ముఖ్యమైన వ్యక్తులలో మాతా వైష్ణో దేవిలో 80.45 శాతం, సూరంకోట్‌లో 74.94 శాతం ఓటింగ్ జరిగింది. ఇదిలావుండగా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడతలో 'తక్కువ ఓటింగ్ శాతం' నమోదు కావడంపై నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. దీనిపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా శుక్రవారం ఘాటుగా స్పందించారు. ఒమర్ అబ్దుల్లా వాదనను ఖండిస్తూ.. ‘పోల్ పర్సెంటేజీలో చూడాలంటే గత ఎన్నికల కంటే 6-8 శాతం అధికంగా ఉంది. అంతేకాకుండా మొదటి దశలో 60 శాతం, రెండో దశలో 58 శాతం ఓటింగ్ జరిగిందని' విలేకరుల సమావేశంలో జేపీ నడ్డా పేర్కొన్నారు. మొదటి దశ సెప్టెంబర్ 18న జరిగింది, మూడవ, చివరి దశ అక్టోబర్ 1న జరగనుంది. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 8న జరుగుతుంది.  

Tags:    

Similar News