Rahul Gandhi : మోడీజీ పెత్తందారీ పోకడల వల్లే నిరుద్యోగ సమస్య : రాహుల్‌గాంధీ

దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్రమోడీ పెత్తందారీ పోకడల వల్లే దేశంలో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు.

Update: 2024-09-27 16:26 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్రమోడీ పెత్తందారీ పోకడల వల్లే దేశంలో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. కేంద్ర సర్కారు నిరంకుశ విధానాల వల్లే మైక్రో, స్మాల్, మీడియం స్థాయి సంస్థలు దెబ్బతిన్నాయని, ఫలితంగా ఎంతోమంది ఉద్యోగ అవకాశాలను కోల్పోయారన్నారు. జమ్మూలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వ్యాపారులు, యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘దేశంలోని చిన్న తరహా వ్యాపారాలపై కేవలం ఐదు నుంచి పది మంది బడా పెత్తందారుల ముప్పేట దాడి జరుగుతోంది. అందువల్లే నిరుద్యోగం పెరుగుతూపోతోంది’’ అని రాహుల్ చెప్పారు. పెద్ద నోట్ల రద్దు, దిగుమతి సుంకాలు, జీఎస్టీ వంటివన్నీ దేశ ప్రజలను ఆర్థికంగా కుదిపేశాయన్నారు. జీఎస్టీ విధానాన్ని మరింత సరళీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చిన్న తరహా వ్యాపారాలకూ బ్యాంకుల నుంచి చేదోడు లభించే పరిస్థితులు ఉండాలని కాంగ్రెస్ అగ్రనేత అభిప్రాయపడ్డారు.


Similar News