నాగ్‌పూర్‌ అల్లర్లు దురదృష్టకరం: డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే

గత రాత్రి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో తీవ్రమైన అల్లర్లు జరిగ్గా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. కాగా ఈ ఘటనల అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు.. పరిస్థితులను అదుపుచేసేందుకు పోలీస్ చర్యలు తీసుకున్నారు.

Update: 2025-03-18 07:14 GMT
నాగ్‌పూర్‌ అల్లర్లు దురదృష్టకరం: డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: గత రాత్రి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ (Nagpur) లో తీవ్రమైన అల్లర్లు జరిగ్గా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. కాగా ఈ ఘటన అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు.. పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. అలాగే కర్ఫ్యూ (Curfew) విధిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో నాగ్‌పూర్ పరిసర ప్రాంతాలు మొత్తం.. ప్రస్తుతం పోలీసుల నిర్బంధంలో ఉంది. అయితే గత రాత్రి జరిగిన నాగ్‌పూర్ హింస (Nagpur violence)పై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం (Deputy CM of Maharashtra) ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగ్‌పూర్‌లో గత రాత్రి జరిగిన సంఘటన దురదృష్టకరమని అన్నారు. ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్ర నా, లేక యాదృచ్చికంగా జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు (Police investigation) చేస్తున్నారని తెలిపారు.

ఈ సంఘటనలో నలుగురు డీసీపీ స్థాయి అధికారులు గాయపడ్డారని, సీఎం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పుకొచ్చారు. అలాగే నాగ్‌పూర్ లోకి బయటి నుండి చాలా మంది వచ్చారని, రాత్రి జరిగిన హింసలో పెట్రోల్ బాంబులు (Petrol bombs in violence) కూడా విసిరారని అన్నారు. నిరసన కారులను అడ్డుకున్న పోలీసులపై కూడా దాడి చేయడం దురదృష్టకరమని, ఈ హింసలో కీలక పాత్ర పోషించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, నాగ్‌పూర్‌లో శాంతిని కాపాడాలని తాను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాని.. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే (Deputy CM Eknath Shinde) చెప్పుకొచ్చారు.


Similar News