ఎంఎస్పీ వెంటనే అమలు చేయాలి.. బీకేయూ నేత రాకేష్ టికాయత్

రైతుల డిమాండ్లను నెరవేర్చకుంటే కన్వర్ యాత్ర తర్వాత పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతామని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ టికాయత్ హెచ్చరించారు.

Update: 2024-06-19 04:23 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రైతుల డిమాండ్లను నెరవేర్చకుంటే కన్వర్ యాత్ర తర్వాత పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతామని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ టికాయత్ హెచ్చరించారు. రైతు సమస్యల పరిష్కారానికి ఒక బలమైన సంస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. బీకేయూ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన ‘హరిద్వార్ కిసాన్ కుంభ్’ ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. 2025 నాటికి 25 కిసాన్ భవన్‌లను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఐక్య పోరాటాలు ఎంతో అవసరమని నొక్కి చెప్పారు.

కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతేగాక పటిష్టమైన భూసేకరణ చట్టం, మూడు వ్యవసాయ బిల్లుల ఉపసంహరణ, మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేశారు. వీటిని వెంటనే అమల్లోకి తేవాలని సూచించారు. అలాగే యువతకు సంబంధించిన సమస్యలపై స్పందిస్తూ..అగ్నివీర్ పథకాన్ని రద్దు చేయాలని పిలుపునిచ్చారు. వీరిని భద్రతా దళాలలో చేర్చాలని తెలిపారు. యువత ఫిర్యాదులను పరిష్కరించడానికి యువ కమీషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. 


Similar News