రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. ఇంటర్ విద్యార్థితో పారిపోయిన ముగ్గురు పిల్లల తల్లి

ఇటీవల కాలంలో సోషల్ మీడియా(Social Media)లో షాకింగ్ ఘటనలు వెలుగు చూడటం గమనిస్తూనే ఉన్నాం.

Update: 2025-03-09 10:41 GMT
రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. ఇంటర్ విద్యార్థితో పారిపోయిన ముగ్గురు పిల్లల తల్లి
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో సోషల్ మీడియా(Social Media)లో షాకింగ్ ఘటనలు వెలుగు చూడటం గమనిస్తూనే ఉన్నాం. రీసెంట్‌గా ఓ మహిళ భర్తను, పిల్లలను వదిలేసి ప్రియుడితో పారిపోయిన ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర(Maharashtra)లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్ విద్యార్థి(Inter Student)తో ముగ్గురు పిల్లల తల్లి పారిపోయిన ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌(Nagpure)లో చోటుచేసుకుంది.

ఒకే ప్రాంతంలో ఉంటున్న 36 ఏళ్ల మహిళ(Women)కు ఆ బాలుడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం శారీరక సంబంధానికి దారితీసింది. అనంతరం వారిద్దరు పారిపోయారు. బాలుడు కనిపించకపోయేసరికి కంగారు పడిన తల్లిదండ్రులు(Parents) పోలీసుల(Police)ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. వారిని గుర్తించి ఆ బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించి.. మహిళను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News