వ్యాక్సినేషన్‌లో భారత్ మరో మైలురాయి

Update: 2022-01-30 10:42 GMT

న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్‌లో దేశం మరో మైలురాయిని చేరుకుంది. 18 ఏళ్లు పైబడిన వారిలో 75 శాతంపూర్తి వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముఖ్యమైన ఘనతలో సహకారం అందించిన తోటి పౌరులకు ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. వ్యాక్సిన్ విజయవంతం చేసేందుకు సహకరించిన వారి పట్ల గర్వంగా ఉందని అన్నారు. 'సబ్కా సాత్, సబ్కా ప్రయాస్ అనే మంత్రంతో, భారతదేశం తన వయోజన జనాభాలో 75 శాతం టీకా రెండు మోతాదులతో సాధించింది. కరోనాపై పోరాటంలో మనం మరింత బలపడుతున్నాం.

మేము అన్ని నియమాలను పాటించాలి. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ పొందాలి' అని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. గత ఏడాది జనవరిలో ప్రారంభించిన టీకా కార్యక్రమంలో ఇప్పటివరకు 165.7 కోట్ల డోసులు అందించారు. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో 15-18 ఏళ్ల పైబడిన వారికి 4.69 కోట్లకు పైగా అందించారు. దీంతో పాటు ఈ నెల 10 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్స్ డోసు ప్రారంభించారు.

Tags:    

Similar News