Amith shah: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్ర ఘటనలు.. అమిత్‌షా ఉన్నత స్థాయి సమావేశం

జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయం తెలిసిందే.

Update: 2024-12-19 15:33 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌(Jammu Kashmir)లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) కశ్మీర్‌లోని పరిస్థితులపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర పాలిత ప్రాంతంలోని ప్రస్తుత పరిణామాలపై సమీక్షించారు. ఈ భేటీకి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా (Manoj Sinha), ఆర్మీ, పారామిలటరీ బలగాలు, హోం మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులు హాజరయ్యారు. కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించేందుకు అమిత్ షా నిర్వహించిన తొలి సమావేశం ఇదే కావడం గమనార్హం. కశ్మీర్‌లో ఉగ్రవాదులను హతమార్చిన నేపథ్యంలో భేటీ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మీటింగ్‌లో ఉగ్రవాద ఘటనలకు సంబంధించిన సమాచారాన్ని అమిత్ షా తెలుసుకున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

అమిత్ షాతో సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ

మరోవైపు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అమిత్ షాతో సమావేశమయ్యారు. కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించడం సహా అనేక ప్రధాన అంశాలపై చర్చించారు. రాష్ట్ర హోదాను త్వరగా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కశ్మీర్‌లోని ప్రధాన సమస్యలను అమిత్ షాకు వివరించారు. కాగా, ముఖ్యమంత్రి అయిన తర్వాత అమిత్ షాతో ఒమర్ భేటీ కావడం ఇది రెండో సారి.

Tags:    

Similar News