ఎన్సీపీకి కేబినేట్ లో దక్కని చోటు.. అజిత్ పవార్ ఏమన్నారంటే?

మోడీ 3.0 కేబినేట్ లో ఎన్సీపీ అభ్యర్థులకు చోటు దక్కలేదు. దీంతో ఎన్సీపీ అజిత్ పవార్ నిరాశకు గురయ్యారు.

Update: 2024-06-09 13:50 GMT

దిశ,నేషనల్ బ్యూరో: మోడీ 3.0 కేబినేట్ లో ఎన్సీపీ అభ్యర్థులకు చోటు దక్కలేదు. దీంతో ఎన్సీపీ అజిత్ పవార్ నిరాశకు గురయ్యారు. కేబినేట్ పదవికి బదులు.. కేంద్రమాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ కు రాష్ట్రమంత్రి పదవి ఆఫర్ చేయడంపై ఫైర్ అయ్యారు. కాగా.. కేబినెట్ బెర్త్ కోసం కొద్దిరోజులు వేచి ఉండేందుకు పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రఫుల్ పటేల్ గతంలోనే కేంద్ర మంత్రిగా పనిచేశారని గుర్తుచేశారు. రాష్ట్రమంత్రి పదవిని తీసుకోవడం సరైంది కాదని భావిస్తున్నామన్నారు. అందుకోసం కొన్ని రోజులు వేచి ఉండేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ విషయాన్నే బీజేపీ హైకమాండ్ కు తెలిపినట్లు వివరించారు. ప్రస్తుతం తమ పార్టీకి ఒక లోక్ సభ, ఒక రాజ్యసభ స్థానం ఉందని అన్నారు. రెండు మూడు నెలల్లో ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, ఒక లోక్ సభ ఎంపీ ఉంటారని అన్నారు. పార్లమెంటులో వారి అభ్యర్థుల సంఖ్య నాలుగుకు చేరుతుందన్నారు. అందుకే కేబినేట్ పదవి కోసం డిమాండ్ చేశామన్నారు.

ప్రఫుల్ పటేల్ ఏమన్నారంటే?

మహారాష్ట్రలోని మహాయుతి కూటమిలో భాగమైన అజిత్ పవార్ పార్టీకి రాష్ట్రమంత్రి పదవిని ఆఫర్ చేశారు. స్వతంత్ర బాధ్యతో కూడిన మంత్రి పదవిని ప్రఫుల్ పటేల్ కు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీనిపైన రాత్రి సమాచారం అందిందని ప్రఫుల్ పటేల్ అన్నారు. ఆ పదవిని "డిమోషన్" అని ఎద్దేవా చేశారు. ఈ విషయాన్ని హైకమాండ్ కు వివరించామన్నారు. అధినాయకత్వం మరికొన్ని రోజులు వేచి ఉండాలని చెప్పారని పేర్కొన్నారు.


Similar News