మోడీ ప్రమాణస్వీకారానికి హాజరైన సార్క్ సభ్యదేశాల ప్రతినిధులు
భారత ప్రధానిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్ దగ్గర జరిగిన ఈ కార్యక్రమంలో సార్క్ సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: భారత ప్రధానిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్ దగ్గర జరిగిన ఈ కార్యక్రమంలో సార్క్ సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె, నేపాల్ ప్రధాని ప్రచండ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మారిసస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అఫీఫ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
నైబర్‌హుడ్ ఫస్ట్
“నైబర్‌హుడ్ ఫస్ట్” విధానం, “సాగర్” విజన్ అనే అంశాలను పరిగణలోకి తీసుకునే సార్క్ సర్వసభ్య దేశాల ప్రతినిధులను ఆహ్వానించినట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది. భద్రత, వృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తామని పేర్కొంది. ఇకపోతే, ప్రమాణస్వీకారానికి హాజరైన నేతలతో మోడీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్, భూటాన్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. అంతకుముందు బంగ్లా ప్రధాని బీజేపీ సీనియర్ ఎల్కే అధ్వానీతో భేటీ అయ్యారు.