రేప‌టి నుండి రూ. 2 పెరుగ‌నున్న ఆ రెండు కంపెనీల పాల ధ‌ర‌లు!

కొత్త ధరలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీలు తెలిపాయి. Announcing milks prices are set to increase with ₹ 2.

Update: 2022-08-16 09:52 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః కొన్ని రోజుల్లోనే పాల ధ‌ర కూడా పెట్రోల్ ధ‌ర‌కు చేరుకునే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌తో ఇటీవ‌ల కాలంలో క‌నీస అవ‌స‌రాల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతుండ‌గా, తాజాగా మ‌రో రెండు ప్ర‌ముఖ పాల బ్రాండ్లు ధ‌ర‌ను పెంచిన‌ట్లు తెలుస్తుంది. క్షేత్ర‌స్థాయిలో పాల సేకరణ, ఇతర ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదల కారణంగా అమూల్, మదర్ డెయిరీ కంపెనీలు పాల‌ ధరలను రూ.2 పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ రెండు బ్రాండ్‌ల కొత్త ధరలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీలు తెలిపాయి.

ఇక‌, రేప‌టి నుండి 500 ml అమూల్ గోల్డ్ ఇప్పుడు రూ. 31, అమూల్ తాజా రూ. 25, అమూల్ శక్తి రూ. 28 కానున్న‌ట్లు అముల్ డెయిరీ బ్రాండ్ మాతృ సంస్థ, గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ తెలిపింది. అలాగే, మదర్ డెయిరీ తన అన్ని పాల రకాలకు ధరలో సవరణ చేసింది. ఫుల్ క్రీమ్ మిల్క్ ఇప్పుడు లీటరుకు రూ. 61, టోన్డ్ మిల్క్ రూ. 51, డబుల్ టోన్డ్ రూ. 45. బల్క్ వెండెడ్ మిల్క్ (టోకెన్ మిల్క్) రూ. 48కు పెరిగింది. "మొత్తం నిర్వహణ వ్యయం, పాల ఉత్పత్తి పెరుగుదల కారణంగా ఈ ధరల పెంపు జరిగింది. గత ఏడాదితో పోల్చితే పశువుల దాణా ఖర్చు మాత్రమే సుమారు 20 శాతానికి పెరిగింది. ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే, మా సభ్య సంఘాలు రైతుల ధరలను గత ఏడాది కంటే 8-9 శాతం వరకు పెంచింది" అని అమూల్ ఒక ప్రకటనలో తెలిపింది.


Similar News